Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు పవన్. అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీ అవుతున్నాడు. దీంతో ఆయన మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్టులు అలస్యమవుతున్నాయి. ముఖ్యంగా క్రిష్ జాగర్లపూడి డైరెక్షన్లో రాబోయే హరిహర వీరమల్లు షూటింగ్ కొవిడ్ సమయంలో మొదలైనా.. ఇంకా పూర్తవలేదు.
వాస్తవానికి వకీల్ సాబ్ తరువాత హరిహర వీరమల్లు సినిమా రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇదిలావుండగా పవన్ మల్టీట్యాలెంటెడ్ గురించి తెలిసిందే. యాక్టింగ్ తో పాటు అవసరమైతే డైరెక్షన్ చేస్తాడు, పాటలు పాడతాడు, ఫైట్స్ కూడా కంపోజ్ చేస్తాడు. అయితే ఇటీవల రాజకీయాల్లో బిజీ అవడంతో ఇలాంటి ప్రయత్నం చేసి చాలా కాలమే అయ్యింది. ఈ నేపథ్యంలో పవన్ హరిహర వీరమల్లు కోసం గొంతు సవరించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో పవన్ ఓ పాట పాడబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. సినిమాలో ఆ పాట టైటిల్ ట్రాక్ గా వస్తుందిట. ఆ పాట ఆద్యంతం ఎమోషన్ గా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. అయితే పవన్ చేత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ పాట పాడించనున్నాడట. ఈ మూవీలో పాటలు ఎక్కువగా ఉండడంతో అందులో ఓ పాట బాధ్యతలు పవన్ కి అప్పగించినట్లు తెలుస్తుంది. చాన్నాళ్ల తర్వాత పవన్ సాంగ్ పడతాడని తెలియడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు.