Pawan Kalyan Sreeleela Mass Dance : గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కు జోడిగా కన్నడ బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా.. ఇటీవలే ఉస్తాద్ టీంలో జాయిన్ అయ్యింది శ్రీలీల. యూత్ లో శ్రీలీలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. శ్రీలీల కేవలం గ్లామర్ తోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంటుంది. సెకండ్ మూవీ రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రీలీల. ధమాకా సినిమాలో ఆమె డ్యాన్స్ మూమెంట్స్ కు మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో శ్రీలీల క్రేజ్ అమాంతం పెయిగిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు, బాలయ్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది.
ఇదిలావుండగా ఉస్తాద్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు ఫ్యాన్స్ అంతా శ్రీలీలతో ఒక మాస్ స్టెప్పు పెట్టండంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. పవన్ తో శ్రీ లీల మాస్ స్టెప్పు పెట్టు గురూ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగ దానికి డైరెక్టర్ హరీష్ శంకర్ డబుల్ థమ్స్ అప్ సింబల్ పెట్టాడు. దీన్నిబట్టి హరీష్ శంకర్ మైండ్ లో కూడా అలాంటి ఒక ప్లాన్ ఉందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఈ మాస్ కాంబో కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎటువంటి మాస్ బీట్ ఇస్తాడో చూడాలి.
Discussion about this post