Prabhas Adipurush : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు-హిందీలో ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌తో వచ్చిన నెగెటివిటీ మొత్తం పటాపంచలు అయింది. ఈ మూవీలో రాఘవుడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే ఆంజనేయుడిగా నటించగా జానకి పాత్రలో హీరోయిన్ కృతి సనస్ కనిపించింది.
అయితే ఆదిపురుష్ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు, సినిమా లవర్స్‌కు బంపరాఫర్ ప్రకటించింది. ఈ మూవీ ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం అని ప్రకటించింది. పేటీఎం ద్వారా టికెట్లు బుక్ చేస్తే.. ఈ ఫ్రీ ఆఫర్ సొంతం చేసుకోవచ్చని తెలిపారు. అయితే ఈ ఆఫర్ జూన్ 30 వరకు ఉండగా కండిషన్స్ అప్లై అవుతాయి.. ఆఫర్ ఎలా పొందాలంటే.. ముందుగా పేటీఎంలో 100 రూపాయలు చెల్లిస్తే.. ప్రొమో కోడ్ వస్తుంది.
ఆదిపురుష్ టికెక్ బుక్ చేసుకునే ముందు ఆ ప్రొమో కోడ్‌ను అప్లై చేస్తే.. 400 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంటే ఆదిపురుష్ సినిమా టికెట్లు రెండు బుక్ చేస్తే.. ట్యాక్స్‌తో కలిపి 700 రూపాయల పైనే అవుతుంది. అదే పేటీఎం ఆఫర్ కోడ్‌ను వినియోగిస్తే సగానికి తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్ కేవలం 350 రూపాయల కనీస ధర ఉన్న టికెట్ మీద మాత్రమే వర్తిస్తుందని టీ సిరీస్.. ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మొత్తానికి ఆదిపురుష్ టీం ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించేందుకు బానే ప్లాన్ చేస్తున్నారు.
Get ready to experience the epic saga with this epic offer! Book 2 movie tickets for the price of 1!
Book now: https://t.co/jDLqWg5G5O @PaytmTickets#Adipurush IN CINEMAS ON JUNE 16! Jai Shri Ram 🙏#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar… pic.twitter.com/wwNhirjPsJ— T-Series (@TSeries) May 10, 2023