Prabhas Health Condition : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆరడుగుల అందగాడు రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎడిగిపోయాడు. సినిమా సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటూ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఒక సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండగానే నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ K షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. తీరికలేని షెడ్యూల్ తో ప్రభాస్ తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. సంక్రాంతి తర్వాత ప్రభాస్ వైరల్ ఫీవర్ బారిన పడి ఓ పది రోజులపాటు షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ సడన్ గా అనారోగ్యానికి గురవడంతో ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లినట్టు సమాచారం.
ప్రస్తుతం ఆయన చేస్తున్న అన్ని సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే అస్సలు ప్రభాస్ కి ఏమైందో తెలీక, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ K షూటింగ్ చివరి దశకు చేరగా సలార్, మారుతీ షూటింగ్ లకి ప్రభాస్ బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
