Priyadarshi Remuneration : ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది స్టార్ కమెడియన్లు హీరోలుగా కూడా తమ సత్తా చాటుతున్నారు. ఈ జాబితాలో ప్రియదర్శి కూడా ఒకరు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు ప్రియదర్శి. ఆ తర్వాత హీరోగా కూడా మంచి అవకాశాలు అందుకున్నాడు. అచ్చమైన తెలంగాణ యాస మాట్లాడే దర్శికి ప్రత్యేకమైనా ఫ్యాన్ బేస్ ఉంది.
ఒకవైపు జాతిరత్నాలు వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాల్లో నటిస్తూనే మరివైపు మల్లేశం, బలగం వంటి హృద్యమైన సినిమాలతో ప్రేక్షకుల మనసులకు మరింత చేరువయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బలగం భారీ వసూళ్లు రాబట్టడంతో ప్రియదర్శి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో తెరలు కట్టి మరీ బలగం సినిమాను సామూహికంగా చూసారు.
ఒక సినిమాకు ఇంతకు మించిన ఆదరణ లేదని చెప్పవచ్చు. హీరోగా మారానని.. కామెడియ న్ గా మాత్రం వెనకడుగు వేయలేదు. ఏడాదికి ఒక సినిమాలో హీరోగా చేస్తూనే.. మరెన్నో సినిమాల్లో కమెడియన్ గా కనిపిస్తున్నాడు. దీంతో నిర్మాతలు కూడా ప్రియదర్శితో సినిమాలు చేయడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు అని ముందుకు వస్తున్నారు.
ప్రస్తుతం సోలో హీరోగా ఒక్కో సినిమాకు ప్రియదర్శి 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రియదర్శి రాబోయే రోజుల్లో కూడా భిన్నమైన కథలతో సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు.