Project K Remunerations : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనేల నటిస్తుండగా బిగ్ బీ అమితాబ్, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ ఈ మూవీలో నటిస్తున్నారు. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కి స్తున్నారు. ఇక మూవీలో ప్రభాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
మేకర్స్ రిలీజ్ చేస్తున్న ఒక్కో పోస్టర్ ఆ అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. ఓవైపు ప్రభాస్, మరోవైపు అమితాబ్ బచ్చన్, మధ్యలో కమల్‌హాసన. వీళ్లందరికీ తోడు… దీపికా పదుకొణె. ‘ప్రాజెక్ట్ కె’ తారాగణం ఇది. ఇక్కడితో ఈ స్టార్ట్ క్యాస్టింగ్ ఆగిపోలేదు కన్నడ, మలయాళ చిత్రసీమల నుంచి కూడా పేరున్న నటీనటుల్ని రంగంలోకి దింపేందుకు దర్శకుడు నాగ అశ్విన, నిర్మాత అశ్వనీదత ప్రయత్నిస్తున్నారని టాక్.
ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నటీనటుల రెమ్యూనరేషన్స్ వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో నటించేందుకు ప్రభాస్ దగ్గర నుంచి కీలకపాత్రధారుల వరకు పెద్ద మొత్తంలో తీసుకుంటున్నారట. ఇంతకీ ఒక్కొక్కరూ ఎంత తీసుకుంటున్నారో తెలుసుకుందామా..
ప్రాజెక్ట్ K కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నాడట. ఇక బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే రూ.10 కోట్లు.. కాగా లోకనాయకుడు కమల్ హాసన్ రూ.50 కోట్లు, అమితాబ్ బచ్చన్ రూ.15 కోట్లు, దిశా పఠానీ రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ప్రొడక్షన్ బడ్జెట్ 400కోట్లు కాగా 600 కోట్లతో ఈ మూవీ తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు.