Pushpa Sukumar : ఒకప్పుడు హాలీవుడ్ కే పరిమితమైన సీక్వెల్ మూవీస్ ఇప్పుడు ఇండియన్ సినిమాలకు కూడా విస్తరించాయి. ఒక పార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యాక పార్ట్ 2 చేయడం లేదా కథ ఇంకా ఎండ్ అవ్వలేదు అనుకున్నప్పుడు పార్ట్ 2 తో మరోసారి మ్యాజిక్ చేస్తారు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప.. ఇలా ఈ వరుసలో చాలా సినిమాలే ఉన్నాయి. ఇందులో బాహుబలి రెండు భాగాలకే ముగిసినా KGF మూడో భాగం వచ్చే అవకాశం ఉంది.
ఇక పుష్ప విషయానికొస్తే.. ఒక భాగంగానే తీయాలని అనుకొని మధ్యలో రెండోభాగం ప్లాన్ చేసాడు సుకుమార్. దీనికి తోడు మొదటి బ్లాక్ బస్టర్ అవ్వడంతో పుష్ప టీంకు మరింత ఉత్సాహం వచ్చింది. ప్రస్తుతం సెకండ్ పార్ట్ షూటింగ్ దశలో ఉండగా మూడో భాగం కూడా ఉంటుందనే టాక్ నడుస్తుంది. అల్లు అర్జున్ మేనరిజం, పుష్పరాజ్ జనాలకు విపరీతంగా ఎక్కడం, దీనికి తోడు వరల్డ్ వైడ్ గా పుష్ప
మేనరిజాన్ని సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అంతా ఇమిటేట్ చేస్తున్నారు. దీంతో మరో పార్ట్ గురించి సుకుమార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీని గురించి సుక్కు తన టీంతో చర్చిస్తునట్టుంది సమాచారం. పుష్ప-2లోనే మూడో పార్ట్ కు సంబంధించి చిన్న హింట్ ఇచ్చి వదులుతారని.. కుదిరితే భవిష్యత్తులో మూడో భాగం తీస్తారని అంటున్నారు. చూడాలి ఈ వార్తల్లో నిజమెంతుందో.. పుష్ప 2 లో పుష్పరాజ్ ఎంతగా ఆకట్టుకుంటాడో..
Discussion about this post