Ram Charan Craze: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న చెర్రీ అనంతరం మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. టాలీవుడ్ హిస్టరీలో కనీవినీ ఎరుగని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది మగధీర. ఒక్కో సినిమాకు చరణ్ తనను తాను మలుచుకొని రంగస్థలంలో పూర్తిస్థాయి నటనతో విమర్శకుల నోటికి తాళం వేసాడు.
చరణ్ గోల్డెన్ స్పూన్ తోనే పుట్టినప్పటికీ తన తండ్రి, బాబాయ్ దగ్గర నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే తత్వం. ఎన్ని అవకాశాలు ఎదురుగా ఉన్నా కూడా ఎప్పుడూ కష్టపడుతూ తనని తాను తీర్చిదిద్దుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తూ వెళ్తున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే RRR తో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.
టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర సైతం గ్లోబల్ స్టార్ అంటూ అభివర్ణించారు. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికా పర్యటనలో చాలా బిజీగా ఉన్నాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ప్రజెంటర్ గా పాల్గొనేందుకు ఆహ్వానం రావడం తో ఆయన అమెరికాలో సందడి చేస్తున్నాడు. అలాగే అక్కడి పాపులర్ మీడియా ఏబీసీ మరియు గుడ్ మార్నింగ్ అమెరికా వంటి షోలో పాల్గొన్నాడు.
ఈ షోలలో పాల్గొన్న తొలి ఇండియన్ హీరోగా రామ్ చరణ్ రికార్డుల సృష్టించాడు. అయితే చెర్రీకి దక్కిన గౌరవంపై ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ హీరోలు ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం. చరణ్ కు దక్కిన అరుదైన అవకాశంపై స్టార్ హీరోలు జలసీగా ఫీల్ అవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే మెగా హీరోలు మాత్రం స్పందిస్తూ రిప్లై ఇస్తున్నారు.
ఇక చరణ్ కు దక్కిన ఈ గౌరవం గురించి అల్లు ఫ్యామిలీ, మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు కూడా స్పందించకపోవడం గమనార్హం. బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో బ్రాడ్ పిట్ మరియు టామ్ క్రూజ్ వంటి వారి పేర్ల సరసనా రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ పేర్లు కూడా నామినేషన్ లో ఉన్నాయి.
అంతర్జాతీయ వేదికపై ఇలా ఉండడం కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియన్ మూవీ సెలబ్రిటీలు ఎంతో గర్వించాల్సిన విషయం. కానీ అంతా తమకు పట్టనట్టే ఉండడం బాధాకరంగా చెప్పవచ్చు. ఏదేమైనా మెగా ఫ్యాన్స్, మూవీ లవర్స్ మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ చరణ్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు.