Rana Daggubati : ఒకానొక సమయంలో స్టార్ డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఎంతో మంది హీరోలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. టాలీవుడ్ లో అందమైన ప్రేమకథలను తెరకెక్కించిన దర్శకులలో తేజ ఒకరు. చిత్రం, జయం, నువ్వు నేను, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలను రూపొందించిన ఆయన.. చాలా కాలం తర్వాత దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ను ‘అహింస’ అనే సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. జూన్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియెన్స్ బాగానే హింసించింది.

దీంతో అహింస డిజాస్టర్‌గా నిలిచింది. ప్రెసెంట్ తేజ బ్యాడ్ ఫామ్ లో ఉన్నప్పటికీ సురేష్ ప్రొడక్షన్ కి ఆయనపై నమ్మకం పోలేదు. దానికి కారణం నేనే రాజు నేనే మంత్రి సక్సెస్. అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా రానాకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది. అయితే తేజ, రానా కాంబో రిపీట్ కానుందని, దానికి రాక్షస రాజు అనే టైటిల్ కూడా ఇటీవల అనౌన్స్ చేసాడు తేజ. ఈ మూవీ పొలిటికల్ థ్రిల్లర్. గాడ్ ఫాదర్ తరహా షేడ్స్ ఉంటూనే వర్తమాన రాజకీయాల గురించి వివాదాస్పద అంశాలు ఉంటాయని సమాచారం.
దీన్ని రెండు భాగాలుగా తీసే ప్లాన్ లో ఉన్నారట. కథ మీద ఎంత నమ్మకం ఉన్నా ఫస్ట్ పార్ట్ తేడా కొడితే సెకండ్ పార్ట్ ని బయ్యర్లకు నష్టాలు పూడ్చుకోవడానికే అమ్మాలి కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఓ హిట్ కొట్టి కమ్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు తేజ.. మరోవైపు రానా కూడా మరో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆగస్ట్ లో ఈ మూవీని స్టార్ట్ చేయనున్నారు. ప్రెసెంట్ సిట్యుయేషన్ లో తేజకు ఇంతకు మించిన అవకాశం రాకపొచ్చు.. రానాతో అయినా తేజ హిట్ కొడతాడేమో చూడాలి.