Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ రష్మిక మందన వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్‌మీడియాలోనూ అభిమానులను తరచూ పలకరిస్తుంటుంది ఈ భామ. తాజాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇటీవలే రష్మిక బర్త్‌డే, ‘పుష్ప2’ గ్లింప్స్ విడుదల కావడంతో రష్మిక గురించి ఇంటర్నెట్ వేదికగా అత్యధికమంది మాట్లాడుకునేలా చేశాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే రష్మిక తాజాగా ఐఎండీబీ (IMDB) ర్యాంకుల్లోనూ అదరగొట్టింది. పాపులర్ సెల్రబిటీలను వెనక్కి నెట్టి టాప్-3లో నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఐఎండీబీ తన ట్విటర్ వేదికగా ర్యాంకులను విడుదల చేసింది. రష్మిక తొలిసారి టాప్-3లోకి రావడం గమనార్హం.
‘పుష్ప’తో జాతీయస్థాయిలో పేరుతెచ్చుకున్న అల్లు అర్జున్ 17వ స్థానంలో నిలవడం గమనార్హం. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ (31) తమన్నా (33) కరీనా (34), నాని (49), కీర్తి సురేశ్ (50)లు ఉన్నారు. ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప2’లో కాకుండా తెలుగు, తమిళ భాషల్లో ‘రెయిన్‌బో’ చిత్రాల్లో నటిస్తోంది నేషనల్ క్రష్ రష్మిక.
