Sai Dharam Tej : నెక్స్ట్ టార్గెట్ చిరు మామే.. మరోసారి పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన షార్ట్ ఫిలిం సత్యకి మంచి ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. శుక్రవారం రోజు ఉమెన్స్ డే సందర్భంగా సాయిధరమ్ తేజ్ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఉమెన్స్ డే రోజున తేజు కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఆల్రెడీ సాయిధరమ్ తేజ్ తన స్క్రీన్ నేమ్ ని సాయి తేజ్ గా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం తేజు తన పేరు మార్చుకున్నాడు. తాజాగా మరోసారి తన పేరు చేంజ్ చేసుకున్నట్లు సాయిధరమ్ తేజ్ ప్రకటించాడు. తన పేరులో తన తల్లి పేరు వచ్చేలా మార్చుకున్నట్లు తెలిపాడు. ఇప్పుడు సాయి తేజ్ నుంచి సాయి దుర్గ తేజ్ గా మెగా మేనల్లుడి పేరు మారింది.

నా తండ్రి ఇంటి పేరు నాతోనే ఉంది, అలాగే నా తల్లి పేరు కూడా నాతోనే ఉండాలనే ఉద్దేశంతో తేజు అలా చేసినట్లు ప్రకటించాడు. అదే విధంగా మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా తేజ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. రాంచరణ్ తో మల్టీస్టారర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నించగా తేజు ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.
రీసెంట్ గానే కళ్యాణ్ మావయ్యతో కలసి నటించాను. అంతకు ముందు నాగ్గాబాబు మావయ్యతో కూడా నటించాను. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి మావయ్య. ఆయనతో నటించిన తర్వాత మిగిలిన వాళ్ళతో ఆలోచిస్తాను అని సాయిధరమ్ తేజ్ ప్రకటించాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో గంజా శంకర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగిపోయింది అంటూ వచ్చిన రూమర్స్ ని తేజు ఖండించాడు.