Samantha : సమంత ఎన్ని ఇబ్బందులు వచ్చినా సైన్ చేసిన సినిమాను కంప్లీట్ చేసే కమిట్ మెంట్ ఉన్న కథానాయిక ఆమె. కెరీర్ బిగినింగ్ నుంచీ బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్. లవ్, యాక్షన్, గ్లామర్, డీ గ్లామర్ పాత్ర ఏదైనా పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుంది. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది. మరో మూడు రోజుల్లో మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ కూడా పూర్తి కానుంది.
ఇది వరకే సంతకం చేసిన “సిటాడెల్” వెబ్ సిరీస్‌ను కూడా దాదాపు పూర్తి చేసింది. ఈ రెండు ప్రాజెక్టులు తర్వాత సమంత సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకొనుందని వార్తలు వస్తున్నాయి. తాజా నిర్ణయం మేరకు కొత్తగా టాలీవుడ్ గానీ, బాలీవుడ్ చిత్రాలకు గానీ సంతకం చేయకూడదనుకుంటుందట. తన ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపరుచుకునేందుకు అవసరమైన అదనపు చికిత్సకోసం ఈ గ్యాప్ తీసుకోనున్నట్లు సమాచారం.
ఒప్పుకుని పూర్తిచేయలేని సినిమాల కోసం ఇదివరకు తీసుకున్న అడ్వాన్సులను సైతం ఆయా నిర్మాతలకు తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. సమంత కొన్ని రోజులుగా ‘మయోసైటిస్’కు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని.. దానికి అవసరమైన అదనపు చికిత్స తీసుకోవడం కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.