Samyuktha Menon Remuneration: మలయాళం పాప్ కార్న్ చిత్రం ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సంయుక్త మీనన్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన చిత్రం భీమ్లానాయక్ లో రానా భార్యగా కనిపించి నటనపరంగా ప్రశంసలు అందుకుంది. అనంతరం కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసారలో చేసింది చిన్న పాత్రే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది.
ఇటీవల విడుదలైన ధనుష్ సార్ మూవీలో మీనాక్షి మేడమ్ గా ప్రేక్షకుల మనసు దోచింది సంయుక్త. ఈ మూడు చిత్రాలు మంచి విజయం సాధించడంతో తెలుగులో హ్యాట్రిక్ హిట్ కొట్టింది సంయుక్త. దీంతో ఇప్పుడు టాలీవుడ్ దర్శక-నిర్మాత దృష్టి ఈ అమ్మడుపై పడింది. ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం తమ చిత్రాలకు ఆమె పేరునే సిఫారసు చేస్తున్నారని టాక్.
దీంతో ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో సంయుక్త రెమ్యునరేషన్ పెంచే ఆలోచనలో ఉందట. అటూ తమిళం, ఇటూ తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న సంయుక్త రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తోందని సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న
విరూపాక్షతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న సంయుక్త, తమిళ్ లో బుమారంగ్ అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు తెలుగులో సితార బ్యానర్లో ఓ సినిమాకు సంతకం చేసినట్లు సమాచారం. ఇందులో ఓ స్టార్ హీరో సరసన నటించనుందట. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే.. సంయుక్త త్వరలో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతోందో..