తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి అంటే అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, కోడిపందాలతో పాటు టాలివుడ్ లో విడుదలయ్యే బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఒక భాగమే. అందులోనూ మెగా వర్సస్ నందమూరి హీరోల మధ్య పోటీ అంటే అంచనాలు ఆకాశానికి తాకుతాయ్. ఈ సంక్రాంతి విడుదలవుతున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రాల్లో ఏది ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుంది అనే విషయంపై ఇప్పటికే భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్లు వినికిడి.
ఈ విషయంపై లోతుగా పరిశీలిస్తే గతంలో మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన 13 చిత్రాలలో 7 ఘనవిజయం సాధించగా 4 యావరేజ్ 2 డిజాస్టర్ గా నిలిచాయి.
ఇటు నందమూరి బాలకృష్ణ టోటల్ గా 17 చిత్రాలతో సంక్రాంతి బరిలో నిలిస్తే 7 హిట్ లు 6 యావరేజ్ 4 ఫ్లాప్ లుగా నమోదయ్యాయి.
గత చిత్రాల రికార్డులను పక్కన పెడితే ఆయా చిత్రాల ఆడియోలు చాలా వరకూ ఆయా చిత్రాల విజయాలలో కీలక పాత్ర పోషించడం ఇక్కడ కీలకమైన అంశం. 1989 లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1997 లో హిట్లర్, 2000 లో వచ్చిన అన్నయ్య, 2017 లో వచ్చిన ఖైదీ నెం 150 చిత్రాలు ముందుగా ఆడియో పరంగా సూపర్ హిట్ అయిన తర్వాతే సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇదే కోవలో బాలకృష్ణ నటించిన 1999 లో వచ్చిన సమరసింహారెడ్డి, 2001 లో నరసింహ నాయడు చిత్రాల ఆడియో సృష్టించిన రికార్డులు కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేసాయ్.
Also Read : కార్మికులకు అవసరం వచ్చినప్పుడు భుజం కాస్తా: చిరంజీవి
ఈ పరంగా చూస్తే ఇటీవల విడుదలైన మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య మూవీలోని “బాస్ పార్టీ” సాంగ్ ఏకంగా “35” మిలియన్ల వ్యూస్ సాధించి యూ ట్యూబ్ ట్రెండింగ్ లో నెం 1 గా నిలవగా, బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీలోని “జై బాలయ్య” సాంగ్ కేవలం 16 మిలియన్ల వ్యూస్ మాత్రమే సాధించి వెనుకంజలో ఉంది. వాల్తేర్ వీరయ్య నుండి రీసెంట్ గా వచ్చిన టైటిల్ సాంగ్ కూడా మెగాఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది..
ఇటీవలే వాల్తేర్ వీరయ్య రష్ చూసిన ఇండస్ట్రీలోని ముఖ్యమైన వ్యక్తులు మూవీ రిజల్ట్ పై పాజిటివ్ టాక్ చెప్పడంతో బయ్యర్లు కూడా వాల్తేర్ వీరయ్య పై అత్యధిక హోప్ పెట్టుకున్న పరిస్థితి.
అంతేకాక 2001లో వచ్చిన నరసింహ నాయుడు సూపర్ హిట్ తర్వాత సీమ సింహం, ఒక్క మగాడు, డిక్టెటర్, జై సింహా, ఎన్టీయార్ కధానాయకుడు లాంటి సంక్రాంతి ఫ్లాప్ లు తప్ప విజయాలు లేకపోవడం కూడా బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ పై పెద్దగా హోప్స్ లేకుండా చేసాయ్.
పై గణాంకాలను పరిగణలోకి తీసుకున్న మెగా అభిమానులు 2023 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ విజేత “వాల్తేర్ వీరయ్యే” అని, మెగాస్టార్ మరోసారి విజయ దుందుభి మోగించడం పక్కా అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. చూద్దాం వారి అంచనాలు ఎంత వరకూ నిజం అవుతాయో..