Shaakuntalam : స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఇప్పటికే అనేకసార్లు వాయిదపడ్డ ఈ మూవీ ఎట్టకేలకు రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజువల్ వండర్ గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ చిత్రంలో సమంతకు జోడీగా దేవ్ మోహన్ నటించాడు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ మూవీతో వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించారు. యశోద తర్వాత వస్తున్న ఈ మూవీ కోసం సామ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సామ్ తో ఖుషి చేస్తున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు ఆ మూవీ టీం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సామ్, విజయ్ జంటగా నటిస్తున్న ఖుషిపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
ఈ నేపథ్యంలో శాకుంతలం హిట్ అయితే ఖుషికి మరింత ప్లస్ అవుతుంది. దీంతో ఖుషి ప్రీ రిలీజ్ బిసినెస్ మరింత జరిగే అవకాశం ఉంది. శాకుంతలం అనంతరం సెప్టెంబర్ 1న ఖుషి విడుదల కానుంది. కాబట్టి శాకుంతలం ఎఫెక్ట్ ఖుషిపై కచ్చితంగా ఉంటుంది. మరోవైపు సరైన హిట్ లేక లైగర్ తో దెబ్బతిన్న విజయ్ కి సామ్ శాకుంతలం హిట్ తో కొంత ఊరట లభిస్తుంది. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ ఖుషిపైనే.. చూడాలి శాకుంతలం సక్సెస్ ఖుషికి ఎంత వరకు ప్లస్ అవుతుందో..
Discussion about this post