Shakuntalam : స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఇప్పటికే అనేకసార్లు వాయిదపడ్డ ఈ మూవీ ఏప్రిల్ 14న మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజువల్ వండర్ గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ చిత్రంలో సమంతకు జోడీగా దేవ్ మోహన్ నటిస్తున్నాడు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ మూవీతో వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించారు. అయితే విడుదలకు ముందు ఈ మూవీకి ఓ షాక్ తగిలింది. యూఎస్ హక్కులు రూ.4 కోట్లకు కొనుగోలు చేస్తామని చెప్పిన బయ్యర్ ఇప్పుడు మాకొద్దని వెనుకడుగు వేస్తున్నారట. చిత్ర నిర్మాతలు మూవీని ఎంతగా ప్రమోట్ చేసినా అంత హైప్ రావడం లేదనని టాక్. నెల రోజుల ముందు నుంచి ప్రచారం చేస్తామని చేయకపోవడంతో మూవీకి మైనస్ అయ్యిందట.
దీంతో రూ.4 కోట్లు పెట్టి సినిమాను కొనలేమంటూ యూఎస్ బయ్యర్ తేల్చేశారట. ఇక ఆంధ్రాలో రూ. 8 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. అయితే ఇందులో దిల్ రాజుకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లే ఉండడం గమనార్హం. పరిస్థితి పూర్తిగా చేజారక ముందే గుణశేఖర్, దిల్ రాజు మూవీ ప్రమోషన్స్ పై దృష్టి సారించారు. 11 నుంచి వరుసగా ప్రీమియర్లు వేయబోతున్నారట. ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ లాంటి హిందూ సంస్థలకు మొదట సినిమాను చూపించే ప్రయత్నం చేస్తున్నారట.