Sonal Chauhan : గోవాలో పుట్టినరోజు సంబరాలను సోనాల్ 16వ తేదీన జరుపుకుంది. ఇదే విషయాన్ని చెబుతూ ఆమె ‘ఇదిగో.. నా కొత్త సంవత్సరం. నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది సోనాల్ చౌహాన్. టాలీవుడ్లో ఎంతో మంది హీరోయిన్లు తమదైన రీతిలో సందడి చేస్తూ స్టార్లుగా దూసుకుపోతోన్నారు. సినిమాలు చేసినా.. చేయకపోయినా సోనాల్ చౌహాన్ మాత్రం సోషల్ మీడియాలో తనదైన రీతిలో హడావిడి చేస్తూనే ఉంటోంది.
ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జన్నత్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ భామ. టాలీవుడ్ గ్లామర్ క్వీన్స్ లో సోనాల్ కూడా ఒకరు. తన అందం, అభినయంతో అందరికీ దగ్గరైయ్యింది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ‘లెజెండ్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఉత్తరప్రదేశ్ బ్యూటీ సోనాల్ చౌహన్. ఈమె నటించిన మొదటి చిత్రమే బ్లాక్ బస్టర్ కావడంతో.. సోనాల్ కు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి.
రామ్ హీరోగా వచ్చిన ‘పండగ చేస్కో’, కళ్యాణ్ రామ్ ‘షేర్’, ఆర్య, అనుష్కల ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’, ’రూలర్’, ‘ది ఘోస్ట్’ వంటి చిత్రాల్లో నటించి వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్3 సినిమాలోనూ సందడి చేసిందీ ఈ బ్యూటీ. పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న ‘ఆదిపురుష్’లో మాత్రం ఈ చిన్నది కీలకమైన పాత్రలో నటించింది. దీనితో పాటు మరికొన్ని బాలీవుడ్ మూవీల్లోనూ సోనాల్ నటిస్తుంది.