చిరు, వెంకీ, నాగ్ లకు హిట్స్ ఇచ్చింది.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్, షాకింగ్ లుక్
ఒకప్పుడు తన అందచందాలతో, అభినయంతో మెరుపులు మెరిపించింది నగ్మా. 1991లో నాగార్జున కిల్లర్ చిత్రంతో నగ్మా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నగ్మా టాలీవుడ్ లో బిజీ స్టార్ గా మారిపోయింది. చిరంజీవితో ఘరానా మొగుడు, వెంకటేష్ తో సరదా బుల్లోడు లాంటి హిట్ చిత్రాల్లో నటించింది.
కొంతకాలం తర్వాత నగ్మా వెండితెరకి దూరమైంది. అయితే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో నగ్మా సాగించిన ప్రేమాయణం ఇండియా మొత్తం హాట్ టాపిక్. అయితే ప్రస్తుతం నగ్మా వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తోంది. నగ్మా మీడియా ముందుకు రావడం కూడా చాలా అరుదు.

అయితే చాలా రోజుల తర్వాత నగ్మా మీడియా కంట పడింది. ఆమె లేటెస్ట్ లుక్ చూసి అంతా షాక్ అవుతున్నారు. చూస్తున్నది నగ్మానేనా అని ఆశ్చర్యపోతున్నారు. అంతలా నగ్మా బరువు పెరిగింది. పూర్తిగా గుర్తుపట్టలేని లుక్ లో ఉంది. గ్రీన్ టాప్ లో మెరిసిన నగ్మా ని ఇలా చూస్తే ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోవడం ఖాయం.
అయితే కొన్నిరోజుల పాటు నగ్మా కాంగ్రెస్ పార్టీ తరుపున పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా ఉండేది. ఏది ఏమైనా నగ్మా లేటెస్ట్ లుక్ మాత్రం ఊహించని షాక్ అనే చెప్పాలి. నగ్మా చివరగా 2002లో జూ ఎన్టీఆర్ కి అత్త పాత్రలో అల్లరి రాముడు చిత్రంలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో నగ్మా కనిపించలేదు.
