Suhas Remuneration : 100 రూపాయల నుంచి 3 కోట్లు.. రెమ్యునరేషన్ పెంచడంపై సుహాస్ కామెంట్స్
హీరో సుహాస్ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. రైటర్ పద్మభూషణ్, కలర్ ఫోటో, అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ ఇలా సుహాస్ వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ఇతడి చిత్రాలు ఓటిటిలో కూడా అద్భుతంగా వర్కౌట్ అవుతున్నాయి. దీనితో సుహాస్ నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు.
దీనితో సుహాస్ తో సినిమా చేసేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. రీసెంట్ గా అంబాజీ పేట మ్యారేజి బ్యాండు చిత్రంతో హిట్ కొట్టిన సుహాస్ అప్పుడే ప్రసన్న వదనం అనే మరో చిత్రాన్ని లైన్ లో పెట్టాడు. ఈ చిత్ర టీజర్ కూడా విడుదలయింది. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ లో సుహాస్ కి రెమ్యునరేషన్ గురించి ప్రశ్న ఎదురైంది.

రెమ్యునరేషన్ పెంచారు అట కదా అని రిపోర్టర్ అడగగా.. ఏం నేను రెమ్యునరేషన్ పెంచకూడదా.. నేనూ బతకాలి కదా అని బదులిచ్చాడు. నేను 100 రూపాయలు తీసుకునే జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానని సుహాస్ తెలిపాడు. మరోసారి రిపోర్టర్ అడుగుతూ మీ రెమ్యునరేషన్ ఇప్పుడు 3 కోట్లు అట కదా అని ప్రశ్నించారు.
సుహాస్ బదులిస్తూ రెమ్యునరేషన్ పెంచిన మాట వాస్తవమే.. కానీ మూడు కోట్లు అనేది అసత్యం అని సుహాస్ క్లారిటీ ఇచ్చాడు. ఏది ఏమైనా సుహాస్ కెరీర్ ని 100 రూపాయలతో ప్రారంభించి ఇప్పుడు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు అని ప్రేక్షకులు అభినందిస్తున్నారు.
