Tamannaah : తమన్నాతో రచ్చ డైరెక్టర్ ప్రయోగం.. వారణాసిలో మొదలు పెట్టారు
రచ్చ చిత్రంతో మాస్ చిత్రాలని చక్కగా డీల్ చేయగలడని డైరెక్టర్ సంపత్ నంది గుర్తింపు పొందారు. ఆయా తర్వాత సంపత్ నందికి ఆ స్థాయికి హిట్ లభించలేదు. కొన్ని చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి. బెంగాల్ టైగర్, సీటీ మార్ లాంటి చిత్రాలు పర్వాలేదనిపించాయి. అయితే సంపత్ నంది కేవలం డైరెక్టర్ గానే ఆగిపోవడం లేదు.
ఓటిటిలో చిత్రాలకు కథలు అందిస్తూ క్రియేటర్ గా వ్యవహరిస్తున్నారు. హెబ్బా పటేల్ నటించిన ఓదెల రైల్వేస్టేషన్ ఓటిటిలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్ గా ఓదెల 2 ప్రారంభం అయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి తమన్నా జాయిన్ అయింది. మొదటి భాగంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పుడు రెండవ భాగంలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రంలో కూడా హెబ్బా పటేల్ ఉంటుంది. కానీ తమన్నా చుట్టూ కథ తిరుగుతుంది. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దృష్ట్యా శక్తుల నుంచి ఎలా రక్షించాడు ? ఇందులో తమన్నా , హెబ్బా పటేల్ పాత్ర ఏంటి అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్ గా వారణాసిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు.

సంపత్ నంది ఈ చిత్రానికి క్రియేటర్ మాత్రమే కాదు.. ఒక నిర్మాత కూడా. తమన్నా, సంపత్ నంది మధ్య మంచి రిలేషన్ ఉంది. సంపత్ నంది తెరకెక్కించిన రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ చిత్రాల్లో తమన్నా నటించింది. ఇప్పుడు ఓదెల 2 లో చేస్తోంది. విరూపాక్ష, పొలిమేర లాంటి చిత్రాలు సూపర్ నేచురల్ అంశాలతో విడుదలై మంచి విజయం సాధించాయి. ఓదెల 2 చిత్రం కూడా అదే తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.