Varun Tej : ఏమాత్రం సంబంధం లేని ముగ్గురు హీరోయిన్లతో వరుణ్ తేజ్.. క్రేజీ డీటెయిల్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గత చిత్రాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఇలా వరుసగా వరుణ్ తేజ్ కి ప్లాపులు ఎదురయ్యాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్.. కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఇందులో మాస్ అంశాలు పుష్కలంగా ఉండబోతున్నట్లు వరుణ్ తేజ్ ఆల్రెడీ ప్రకటించాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. తాజాగా మరో ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారట.
ఆ ఇద్దరి పేర్లు వింటే ఆశ్చర్యం అనిపించక మానదు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు నోరా ఫతేహి.. మరొకరు సలోని. నోరా ఫతేహి ఎక్కువగా ఐటెం బ్యూటీ గానే గుర్తింపు పొందింది. బాహుబలి, లోఫర్, టెంపర్ లాంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేయడం లేదట. కానీ కీలక పాత్రలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.
నెలరోజుల పాటు ఈ చిత్ర షూటింగ్ కోసం నోరా కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనే ఆమె పాత్రకి ఎక్కువ సన్నివేశాలు ఉన్నట్లే. ఇక మర్యాద రామన్న చిత్రంలో నటించి ఆ తర్వాత కనుమరుగైన సలోని ఈ చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర కూడా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.