బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నటనకీ, అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇటీవల ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది ఆమెకు మరింత స్పెషల్ అనే చెప్పాలి. గంగూభాయ్, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయంతో పాటు.. ప్రేమించిన రణ్ బీర్ ని పెళ్లి కూడా చేసుకుంది. ఇదే ఏడాది.. ఆమె తల్లి కూడా అయ్యింది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోన్న ఆలియా.. ఇటీవల యోగా శిక్షణకు వెళ్తోంది. త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకే ఈ ఏర్పాట్లు అంటున్నారు.
అయితే తల్లయ్యాకా తన ఆలోచన తీరులో చాలా మార్పులొచ్చాయని చెప్పింది అలియా. ‘‘తల్లిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాక నా వ్యక్తిగత జీవితంలో భారీ మార్పులు వచ్చాయి. ఇంతకుముందు కంటే స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాను’’ అని చెప్పింది. నా జీవితంలో వచ్చిన మార్పుల దృష్ట్యా.. నేను భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు ఓకే చేస్తాను, ఎలాంటి పాత్రలు ఎంచుకుంటాను అనే క్లారిటీ నాకే రావడం లేదు.
నా కెరీర్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను అని మాత్రం చెప్పగలను అంటూ తన కెరీర్ గురించి తన ఆలోచనలను వెలిబుచ్చింది. ప్రస్తుతం ఆలియా కరణ్ జోహార్ చిత్రం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీతో పాటు ‘హార్ట్ స్టోన్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ‘ఆర్‌ఆర్ఆర్’తో పాన్ ఇండియా హీరోయిన్ అయిన ఆలియా.. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేస్తుందనే వార్తలొచ్చాయి. అదే సమయంలో గర్భవతి అని తెలియడంతో ఆ సినిమా నుండి తప్పుకుంది. ఇప్పుడు తిరిగి యాక్టింగ్ షురూ చేశాక మళ్లీ తెలుగు ఆలోచన చేస్తుందేమో చూడాలి.
