Tollywood Star Heroes Study Details : స్టార్ హీరోస్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో తెలిసిందే. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా వారిని గాడ్ లా ఫీల్ అవుతారు. మన అభిమాన నటులు తెర మీద మనల్ని అలరించడంతో పాటు తెర వెనుక ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం చదివారు లాంటి విషయాలు మనకు తెలుసుకోవాలని ఉంటుంది. ఒకసారి మన టాలీవుడ్ స్టార్ హీరోల విద్యార్హతలు ఏంటో చూద్దాం..
చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని కాలేజీ నుండి బీకాం డిగ్రీ పొందాడు.
పవన్ కళ్యాణ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించాడు.
బాలకృష్ణ: నందమూరి నట సింహ బాలకృష్ణ హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశాడు.
నాగార్జున: టాలీవుడ్ మన్మథుడుగా పేరొందిన నాగార్జున. మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేశాడు. తరువాత యాక్టింగ్ లో శిక్షణ తీసుకుని సినిమాల్లోకి ప్రవేశించాడు.
వెంకటేష్: విక్టరీ వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఇండియాకు వచ్చి కలియుగ పాండవులు సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు.
మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబు మద్రాస్ లోని లయోలా కాలేజీలో బీకాం పూర్తి చేశాడు.
ప్రభాస్: ప్రభాస్ భీమవరంలో డిఎన్ఆర్ స్కూల్ లో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. తరువాత హైదరాబాదులో బీటెక్ పూర్తి చేశాడు.
అల్లు అర్జున్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఎమ్మెస్సార్ కాలేజ్ లో బీబీఏ పూర్తి చేశాడు.
రామ్ చరణ్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బీకాం చదువుతూ మధ్యలోనే ఆపేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత సినిమాల్లోకి వచ్చాడు. రానా చెన్నై ఫిలిం స్కూల్ నుండి ఇండస్ట్రీయల్ ఫోటోగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాడు.
రవితేజ: మాస్ మహారాజ్ రవితేజ విజయవాడలోని సిద్దార్థ డిగ్రీ కాలేజీలో బీఏ చదివాడు.
నాని: నేచురల్ స్టార్ నాని సికింద్రాబాద్ లోని వెస్లీ కాలేజీలో డిగ్రీ చదివాడు.
విజయ్ దేవరకొండ: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్లోని కాచిగూడ బద్రుక కాలేజీలో బీకాం చేసాడు.
నాగ చైతన్య: అక్కినేని నాగ చైతన్య బీకాం చదివాడు. సాయి ధరమ్ తేజ్ బీఎస్సీ బయోటెక్నాలజీ చదివాడు. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు. అలాగే నితిన్, రామ్, శర్వానంద్, సందీప్ కిషన్ వీళ్లంతా డిగ్రీ పూర్తి చేశారు.
Discussion about this post