Trisha Leo Remuneration : తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత.. ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోల్లో దళపతి విజయ్ ముందు వరుసలో ఉంటాడు. ప్రెసెంట్ విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ‘లియో’ మూవీ తెరకెక్కుతోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో అదిరిపోయే ఫ్యాన్ బేస్ సంపాదించిన లోకేష్.. ఆ రెండు చిత్రాలను లింకప్ చేస్తూ LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)ను సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లియో కూడా అందులో భాగమే అని టాక్.
తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ ను అలాగే నా రెడ్డి అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. వీటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు చూపించారు. ఈ మూవీలో విజయ్ సరసన సౌత్ క్వీన్ త్రిష నటిస్తుంది. విజయ్, త్రిష 14 ఏళ్ళ విరామం తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోయిన్లకు అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. కానీ ఇందులో త్రిషకు ఇంపార్టెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ మూవీకి చెన్నై బ్యూటీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. లియో మూవీ కోసం త్రిష రూ.10కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లో యువరాణి కుందవై పాత్రలో నటించి తన అందంతో అందరినీ ఆకట్టుకున్న త్రిషకు ప్రస్తుతం ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
PS విజయం తర్వాత త్రిష రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసింది. సౌతిండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ త్రిషనే అని ఫిన్‌క్యాష్ తాజాగా చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది. ఇక లియో గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నప్పటికీ ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.