టాలీవుడ్ లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు విజయ్ దేవరకొండ. అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరో స్టేటస్ ని అందుకున్నాడీ తెలంగాణా కుర్రాడు. మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడే విజయ్ ని స్టార్ హీరో కేటగిరీ లోకి ఆహ్వానించారు అంటే మనోడి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీ వాలా లాంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో గా మారిన విజయ్ చుట్టూ వివాదాలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి.
అర్జున్ రెడ్డి సమయం లో పోస్టర్ వివాదం,తర్వాత చాలా సినిమా ఫంక్షన్స్ లో అతను మాట్లాడిన మాటలు కూడా వివాదాలకు దారి తీశాయి. ఈ మధ్య పూరీ జగన్నాద్ డైరెక్షన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ లైగర్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఇదే అదను గా కొంత మంది నెటిజన్లు విజయ్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం జరుగుతుంది. లైగర్ పరాజయానికి విజయ్ ఆటిట్యూడ్ కారణం అంటూ విజయ్ ను టార్గెట్ చేస్తున్నారు.
కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే… సినిమా జయాపజయాలకు హీరో ఆటిట్యూడ్ కి సంబందం లేదు. ఈ విషయాన్ని గుర్తించాలి. ఇదే విజయ్, అర్జున్ రెడ్డి ఆడియో ఫంక్షన్లో కూడా అదే ఆటిట్యూడ్ తో మాట్లాడడం జరిగింది. కానీ అర్జున్ రెడ్డి ఎంత సక్సెస్ అయింది అనేది అందరికీ తెలిసిన విషయమే.
కాకపోతే ఇక్కడ విజయ్ కూడా ‘ మా తాత తెల్వదు ‘ ‘ మా నాన్న తెల్వదు ‘ లాంటి మాటలతో ఇతర హీరోల అభిమానులు నీ రెచ్చగొట్టడం లాంటివి మానుకుని, తన సినిమా గురించి ఏ స్థాయి లో గొప్పలు చెప్పుకున్న అంత గా ఇబ్బంది ఉండదు అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.
మరి లైగర్ పరాజయం తర్వాత దానికి తన ఆటిట్యూడ్ కారణం అన్న విమర్శల్ని ఒప్పుకుని విజయ్ తన ప్రవర్తన మార్చుకుంటాడా??? లేక ఎప్పటిలాగానే తన ఆటిట్యూడ్ కొనసాగిస్తూ తర్వాత సినిమాలు హిట్ కొట్టి సినిమా సక్సెస్ కి తన తన ప్రవర్తన కి సంబంధం లేదు అనే విషయాన్ని ఋజువు చేస్తాడా??? అనేది వేచి చూడాల్సిందే.