Virupaksha Movie Team : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా ఈ మూవీకి కార్తీక్ దండు దర్శకుడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి.
యాక్సిడెంట్ తర్వాత తేజ్ నటించిన విరూపక్షకి పాజిటివ్ టాక్ వచ్చిన వెంటనే చిరంజీవి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. పవన్ కల్యాణ్, తన మేనల్లుడికి పుష్పగుచ్ఛం పంపించారు. హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో పీరియాడిక్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో యూనిట్ సభ్యులు సఫలం అయ్యారు. విరూపాక్ష సినిమాను అన్వేషణ కాష్మోర.. తులసీదళం సినిమాలతో పోల్చుతున్నారు.
ఇందులో తేజ్ నటన.. కార్తీక్ దండు టేకింగ్ సినీ ప్రియులను కట్టిపడేశాయి. ఈ క్రమంలోనే విరూపాక్ష మూవీ టీం ప్రేక్షకులకు స్పెషల్ రిక్వెస్ట్స్ చేస్తుండడం విశేషం. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయని.. వాటిని ముందుగానే లీక్ చేయవద్దని కోరుతున్నారు. మూవీలోని కీలక అంశాలు.. ట్విస్టులను దయచేసి ఎక్కడా లీక్ చేయకండి. వెండితెరపై సినిమా చూసి ఓ అద్భుతమైన అనుభవాన్ని పొందండి” అంటూ పేర్కొంది.
https://twitter.com/SVCCofficial/status/1649322307205361664?t=1Omby5EmlI5J5XrrgDE7Hg&s=19
Discussion about this post