ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని పెద్దలు చెబుతారు.
ఒకప్పుడు అబ్బాయిలకు 25 అమ్మాయికి 18 సంవత్సరాల లోపు వివాహాలు జరిగేవి.
కానీ ఇప్పుడు వృత్తిలో బాగా ఎదగాలి, సొంతంగా ఫ్లాట్, కారు, బ్యాంక్ బ్యాలన్స్ ఇవన్నీ సంపాదించిన తరువాతే పెళ్ళి ఇది నేటి యువత దోరణి. అన్ని సంపాదించే సమయానికి వయసయిపోయి సరైన జోడీ దొరకక అన్ని రకాలుగా సరిజోడీ కాకపోయినా ఎవరో ఒకరితో సర్దుకొని పోయి జీవించడం పరిపాటి గా మారింది. దానితో పాటు బోనస్ గా ఇప్పుడున్న ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే డయాబెటిస్ , బీపీ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు మొదలు అవుతున్నాయి.
అందువల్ల కొంతమంది తెలివిగా యుక్త వయసులోనే వివాహం చేసుకుంటున్నారు. ఆ జాబితాలో ఇటీవలే ఓ టీ టీ లో విడుదలై మంచి విజయవంతమైన కృష్ణ అండ్ హిస్ లీల హీరోయిన్ షాలిని వడ్ని కట్టి కెరీర్లో ఎదుగుతున్న సమయంలోనే యువ తమిళ దర్శకుడు మనోజ్ బీదను వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.
సాధారణంగా హీరోయిన్లు కెరీర్ ముగిసిన తర్వాతనే వివాహాలు చేసుకుంటారు కానీ షాలిని ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ కెరీర్ ఆరంభంలోనే ఎదుగుతున్న సమయంలో వివాహం చేసుకుంది. మరి ఈ యువ హీరోయిన్ బాటలో నడుస్తూ ఎంత మంది పెళ్ళి పీటలు ఎక్కుతారో చూడాలి. నూతన జంటకు ట్రెండ్ ఆంధ్రా తరపున శుభాకాంక్షలు.