ప్రతీ చిత్రంలో ఓ సరికొత్త లుక్ తో ఎంట్రీ ఇచ్చే అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం కోసం స్టన్నింగ్ లుక్ తో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి కేక పుట్టించాడు. అల్లు అర్జున్ నయా లుక్ చూసి అభిమానులు అల్ట్రా మోడర్న్ సూపర్ హీరో అని ట్వీట్లు పెడుతూ సందడి చేస్తున్నారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అల వైకుంఠపురం లో 147 కోట్ల షేర్ సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్స్ (non BB) క్రియేట్ చేసింది. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తో స్టైలిష్ స్టార్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. దీని తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ తో మరో సినిమా అనౌన్స్ చేశాడు. కొరటాల ఆచార్య మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.