మెగాస్టార్ చిరంజీవి 152 వ చిత్రం ఆచార్య ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొరటాల శివ మూవీ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. దానికి కారణం కొరటాల గతంలో తీసిన సినిమాలు ఉదాహరణగా చెప్పొచ్చు. కొరటాల స్టైల్లోనే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక సోషల్ మెసేజ్ కూడా ఆచార్యలో ఉండబోతుంది అని మోషన్ పోస్టర్ చెప్పకనే చెబుతుంది. ఈ సినిమాలో అవినీతిపై పోరాడే నక్సలైట్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని సమాచారం. మెగా వారసుడు రామ్‌చరణ్ కూడా ఈ చిత్రం నటిస్తున్నారని తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన మోషన్ పోస్టర్ అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. వచ్చే సంవత్సరం వేసవిలో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.