ఒక షూటింగ్ టైంలో తలనొప్పి వస్తే డౌట్ వచ్చి హాస్పిటల్ లో టెస్ట్ చేయించుకుంటే.. కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, తర్వాత అన్ని ప్రికాషన్స్ తీసుకుని, ఐసోలేట్ అయి, డాక్టర్స్ సలహాలతో ప్రస్తుతం దాన్నుంచి బయటకు వచ్చేసాను అని కొన్ని రోజుల క్రితం సింగర్ సునీత ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
అయితే, ఆ వీడియో లో ఆమె ఇంగ్లీషులో మాట్లాడటం పై కొంతమంది ‘తెలుగు రాదా? ఫ్యాషన్ ఆ? కరోనా వస్తే ముందు హాస్పిటల్ కి వెళ్లి చావు. మీడియాలో పబ్లిసిటీ కోసం అవసరమా? అంటూ వ్యాఖ్యలు చేయడం తనను చాలా బాధించిందని.. తాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా పాటలు వాడడం వల్ల అక్కడ కూడా తన అభిమానులు ఉన్నారని అందరికీ ఒకేసారి విషయం తెలుస్తుందని ఎక్కువగా ఇంగ్లీషులో లో మాట్లాడటం జరిగిందని.. విషయం తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రోజు నుండి కరోనా గురించి తన అనుభవాన్ని.. కరోనాపై కల్పించాలి అనుకున్న అవగాహన కార్యక్రమాలను విరమించుకున్నాను అని ఇంకా ఏం వినాల్సి వస్తుందో.. ఇప్పటికే ఉన్నవి చాలవా? అంటూ ఆవిడ పోస్ట్ చేశారు.
దీనికి పెద్ద ఎత్తున ఆవిడ అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఎవరో కొందరు మానసిక రోగుల గురించి పట్టించుకోనవసరం లేదని, అలా మాట్లాడే వాళ్ల గురించి ఒక మంచి కార్యక్రమాన్ని విరమించుచుకోనవసరం లేదని ఆవిడని కోరుతున్నారు.