తెలుగులో ఒక పేరున్న హీరో చిత్రం థియేటర్లో కాకుండా మొట్టమొదటిసారి ఓటీటీ వేదికపై విడుదలవుతుంది.
అందరిలోనూ ఈ చిత్ర ఫలితం పై ఆసక్తి, అనుమానాలు నెలకొని ఉన్నాయి.కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ట్రైలర్ తోనే దుమ్ము లేపుతున్నాడు నాచురల్ స్టార్ నాని.
తాజాగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని హిరో గా సుధీర్ బాబు ముఖ్య పాత్రలో నటించిన “V” చిత్రం ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతుంది.
ఇప్పటికే 1కోటి 20 లక్షల పైచిలుకు వ్యూస్ ని సొంతం చేసుకొని ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న ఆసక్తిని, అంచనాలను మరింత రెట్టింపు చేసింది.
ఈ చిత్ర ఫలితం కోసం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న చిత్ర నిర్మాణ సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ సినిమా హిట్ అయితే మరిన్ని చిత్రాలు ఓటీటీ బాట పట్టే అవకాశం ఉంది. మరి నాని ఎలాంటి సంచలనాలు రేపుతాడో చూడాలంటే సెప్టెంబర్ 5 వరకు ఆగాల్సిందే.