టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మన టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్, దగ్గుపాటి రానా ఒక ఇంటివారయ్యారు. వారి బాటలోనే హీరో శర్వానంద్ తన చిన్ననాటి స్నేహితురాలు, వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం.
శర్వానంద్ ప్రేమ పెళ్లి గురించి ఇరు కుటుంబ సభ్యులతో మాట్లాడడం, దానికి వారు అంగీకరించడం కూడా జరిగిపోయిందనీ.. వీలైతే ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని లేకపోతే నిశ్చితార్ధం చేసుకుని వచ్చే సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.