తమ పిల్లల బాల్యం, వారు చేసే అల్లరి పనులు, ముద్దు ముద్దు మాటలకు మురిసిపోవడం, వారితో కలిసి ఆటలాడడం తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కలిగిస్తాయి. కానీ సినీ రంగంలో ఉండే వారు అలాంటి ఆనందాలకు వృత్తిరీత్యా దూరంగా ఉండడం వలన మిస్ అవుతుంటారు. కానీ కొంతమంది తారలు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆ కోవలో మహేష్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. అయితే సినిమా లేదంటే కుటుంబానికే తన మొదటి ప్రాధాన్యత అని ఎన్నో సందర్భాల్లో ఆయన తెలిపారు. అంతేకాక షూటింగ్ లేని సందర్భాల్లో కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లి పిల్లలతో ఆనందంగా గడుపుతుంటారు. కరోనా సంక్షోభం వల్ల షూటింగులు లేక ఇంటికే పరిమితమైన మహేష్ తనకు దొరికిన ఈ ఖాళీ సమయంలో తనయుడు గౌతమ్ తో కలిసి వీడియో గేమ్స్ ఆడుతూ, అల్లరి చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు.
ఈరోజు తనయుడి పుట్టినరోజు సందర్భంగా గౌతమ్ చిన్నప్పటి ఫోటో ట్విటర్ లో పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు.