నడిచోచ్చే సీమ టపాకాయ్ లాంటి హై ఓల్టేజ్ ఎనర్జీ కలిగిన స్టార్ రవితేజ తిరిగి షూటింగ్ సెట్లో అడుగుపెడుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ,శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న “క్రాక్” చిత్రం లాక్‌డౌన్ తర్వాత ఈరోజు నుండి తిరిగి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ప్రారంభిస్తున్నారు.
సముద్రఖని, వరలక్ష్మి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం గత మేలో విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ లో రవితేజ న్యూ లుక్ చిత్రం పై మరింత అంచనాలు పెంచే విధంగా ఉంది. సరస్వతి ఫిలింస్ డివిజన్ నిర్మిస్తున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఇక మిగిలిన భాగం చిత్రీకరణ ఈరోజు మొదలైంది. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తుండగా, సాయి మాధవ్ బుర్ర సంభాషణలు రచిస్తున్నారు. అక్టోబర్ 15 నుండి థియేటర్లు తిరిగి ప్రారంభమైన తర్వాత ముందు వరుసలో వచ్చే చిత్రం ఇదే కాబోతుంది.