క్రైమ్,యాక్షన్ వెబ్ సిరీస్ లను ఇష్టపడే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ మీర్జాపూర్. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఉత్తరాదినే కాదు.. దక్షిణాదిన కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించి మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మీర్జాపూర్-2 అక్టోబర్ 23 వ తేదీన అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ వేదికగా విడుదలకానున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.
పంకజ్ త్రిపాటి, అలీ ఫజల్, కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్‌లు తెరకెక్కించారు.
వాస్తవానికి ఈ సీజన్ 2 ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ మూలంగా షూటింగులకు బ్రేక్ పడి ఆలస్యం అయింది. దీనికి సంబంధించిన వీడియోను అమెజాన్ ప్రైమ్ సంస్థ విడుదల చేసింది. సీజన్ 2 ను గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ లు తెరకెక్కించారు. మీర్జాపూర్ 2 ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.