బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై ఒక మహిళను నిందించటం సరికాదని మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సాటి మహిళగా డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న రియాకు మద్దతు తెలపడం నేను చేసిన నేరమా? అని ఆవిడ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి అనీ.. సిఐడి, ఈడి, ఎన్ సిబి ఇంతమంది విచారణ చేస్తున్నప్పుడు వారి నుంచి ఎవరు సమాచారాన్ని లీక్ చేస్తున్నారనీ వారిపై ఎవరు చర్య తీసుకుంటారనీ ప్రశ్నించారు.
దేశంలో ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కోవిడ్ కేసుల్లో మొదటి స్థానంలో ఉన్నాం. ఆర్థిక పరిస్థితి దిగజారింది. దాని గురించి ఎవరూ మాట్లాడకుండా ఒక అమ్మాయిని రాజకీయపరంగా టార్గెట్ చేయడం సరైందికాదని చట్టం అడ్డు రాకపోతే తాను చాలా మాట్లాడగలనని వాట్స్అప్ మెసేజ్ కల్పితం కావచ్చు కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు పెట్టే ఆంక్షలు మీడియాకు వర్తించవా అని ప్రశ్నించారు. తనపై వచ్చే వార్తలు చూసి అమ్మ కంగారు పడుతోందని రియాకు మద్దతు తెలపడం నాకు ఒక గుణపాఠం అయిందని ఇకపై అభిప్రాయాలను ఓపెన్ గా చెప్ప కూడదని నిర్ణయించుకున్నాను అని మంచు లక్ష్మి తెలిపారు.