ఒక పేదవాడికి కష్టమొస్తే సినిమాల్లో హీరోలు వెంటనే అండగా నిలబడి ఆ కష్టాన్ని తీర్చి ప్రేక్షకుల మనసు గెలుచుకుంటారు.
సినిమా హీరోలు జీవితంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక విలన్ నిజ జీవితంలో హీరో గా మారి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఒక్క సోనూ సుద్ విషయం లోనే సాధ్యమవుతుంది.
లాక్ డౌన్ సమయంలో వలస కూలీలకు అండగా నిలిచి
కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న సోనూ సూద్ మరొక్కసారి తన ఉదారతను చాటుకున్నారు.
మహారాష్ట్ర లోని సింధుదుర్గ్ జిల్లాకు చెందిన స్వాప్నాలి సుతార్ మెడికల్ పోటీ పరీక్షకు సిద్ధమవుతోంది. ఆన్లైన్ క్లాస్ లకు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి అవసరం అయిన విషయలు తెలుసుకోవడానికి ఇంటర్నెట్ కావాలి. కానీ ఆ గ్రామం లో ఫోన్ నెటవర్క్ కి కావలిసిన సిగ్నల్స్ లేవు.
ఆమె చదువుకోవటానికి వీలుగా ఆమె సోదరులు సిగ్నెల్ అందే చోట చిన్న టెంట్ లాంటిది ఏర్పాటు చేసారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకొన్న బాలీవుడ్ హీరో సోను సూద్ ఆమె వివరాలు కావాలి అని వాళ్ళ గ్రామానికి త్వర లో WIFI సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ట్వీట్ చేసారు. తనలోని మానవీయ కోణాన్ని ప్రపంచానికి మరోక్కసారి పరిచయం చేసి అందరీతో శభాష్ అనిపించుకున్నారు.