అల్లు అర్జున్ ఒకప్పుడు ఇతను హీరోనా? అని విమర్శలు ఎదుర్కొన్న స్థాయి నుండి, హీరో అంటే ఇతనే.. అనే స్థాయి కి ఎదిగిన నటుడు. యూత్ కి అతడొక స్టైల్ ఐకాన్, తన డాన్సులతో అల్లరి నటనతో ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూ అలరించడంలో ఆరితేరాడు. తెలుగులో ఎవరికీ సాధ్యం కాని విధంగా మలయాళ చిత్ర పరిశ్రమలో మార్కెట్ ను సొంతం చేసుకున్నాడు. కేరళలో పెద్ద హీరోల చిత్రాలకు ధీటుగా అతడి కలెక్షన్స్ వచ్చేంత బలం అతడి సోంతం. మల్లు అర్జున్ అంటూ మలయాళ ప్రేక్షకులు తమ హృదయాలలో అతడిని తమ వాడిగా స్థానం కల్పించారు.
గత సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురం తెలుగు లోనే కాదు మలయాళం లో కూడా సూపర్ హిట్ కలెక్షన్స్ సాధించి సంక్రాంతి బరి లో నెంబర్ వన్ గా నిలిచింది. ఇప్పుడు యూట్యూబ్ లో మరియు టెలివిజన్ లో రికార్డుల మోత మోగిస్తోంది. “అల వైకుంఠపురం” మ్యూజిక్ ఆల్బమ్ యూట్యూబ్ లో 1.5 Billion అంటే 150 కోట్ల హిట్స్ సాధించింది. నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి, సిత్తరాల సిరపడు, రాములో రాములా, బుట్ట బొమ్మ, ఓ మై గాడ్ డాడీ, ఇలా ఆల్బంలో అన్ని పాటలు కలిపి ఇన్ని హిట్స్ సొంతం చేసుకుని సౌత్ లో ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి చిత్రంగా నిలిచింది.
అంతేకాకుండా ఇటీవల టెలివిజన్ తెరపై వరల్డ్ ప్రీమియర్ షోగా ప్రదర్శితమై 2 కోట్ల 19 లక్షల 86 వేల వ్యూస్ సాధించి ఆ ఘనత సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ చిత్రంగా నిలిచింది. తన బాడీ లాంగ్వేజ్ కి సరిపడా కథ దొరికితే ఎలా చెలరేగి పోతాడో బన్నీ నట విశ్వరూపాన్ని అల వైకుంఠపురం లో చూపించాడు. ఇప్పుడు విడుదలై ఇంతకాలమైనా ప్రేక్షకులు బన్నీ అల్లరి ని ఎంజాయ్ చేస్తున్నారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న “పుష్ప” చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం “నారా రోహిత్” ని సంప్రదించారని కథ విన్న అతడు తన పాత్ర నచ్చి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరి “పుష్ప” చిత్రంతో బన్నీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.