బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని NCB అధికారులు నాలుగు రోజులుగా విచారణ చేస్తున్న నేపథ్యంలో రియాను మాదకద్రవ్యాల సరఫరా ఆరోపణలపై అరెస్ట్ చేశారు.
ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి తో సహా ఏడుగురిని అరెస్ట్ చేయగా, రియా సూచన తోనే డ్రగ్స్ సరఫరా చేసినట్టు రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి వాంగ్మూలం ఇచ్చాడు.
సుశాంత్ తండ్రి సుశాంత్ మరణానికి రియానే కారణం అని ఆమెపై గతంలో ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విచారణలో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగం మరియు సరఫరాలో ఇంకా 25 మంది బాలీవుడ్ ప్రముఖులకు సంబంధం ఉందని, వారి పేర్లను రియా అధికారులకు వెల్లడించింది. పది రోజుల్లో ఆ బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నామని NCB అధికారులు తెలిపారు. వారి విచారణలో పలు ప్రశ్నలకు జవాబు తెలపకుండా రియా మౌనం పాటించింది. ఈ నేపథ్యంలో రియా ఇంట్లో ఆమె ఫోన్, లాప్టాప్ ఇతర కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని పలు ఆధారాలను అధికారులు గుర్తించారు. 2017, 18, 19 లలో మాదకద్రవ్యాల మాఫియాలో రియా యాక్టివ్ గా ఉన్నట్లు తేలింది.
ఈ విచారణలో భాగంగా నార్కోటిక్ అధికారులు రియాకు పలు మెడికల్ టెస్ట్ చేయగా.. ఎన్నడూ డ్రగ్స్ సేవించలేదని చెప్పిన ఆమె మెడికల్ టెస్ట్ లో కరోనా నెగిటివ్ రాగా, మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్లు తేలింది. సుశాంత్ సూసైడ్ కి ముందు సోదరుడితో తానే డ్రగ్స్ తెప్పించుకున్నట్లు విచారణలో వెల్లడించింది. రియాను అరెస్ట్ చేసిన అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెట్టారు రియా బెయిల్ కోసం లాయర్లు చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. ఆమెకు కోర్టు14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.