తెలుగు ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న
రానా దగ్గుబాటి వివాహం రామానాయుడు స్టూడియోలో కోవిడ్ నిబంధనలను అనుసరించి పరిమిత సంఖ్యలో అతిథులతో వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఇరుపక్షాల కుటుంబ సభ్యులు సినీ రంగంలోని కొంతమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.
హాజరైన వారిలో రామ్ చరణ్ దంపతులు, నాగచైతన్య సమంత దంపతులు, రాజమౌళి ప్రభాస్ ఇలా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దగ్గుబాటి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఈ వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ రానాకి వివాహ శుభాకాంక్షలు చెబుతున్నారు.
