నేచురల్ స్టార్ నాని హీరోగా సుధీర్ బాబు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం v ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. లాక్ డౌన్ కారణంగా ఇప్పట్లో థియేటర్లో తెరుచుకునే పరిస్థితి లేకపోవడం వల్ల కొన్ని నెలలుగా విడుదల వాయిదా పడుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియో లో సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కాబోతుంది.
తెలుగులో ఓటీటీ ప్లాట్ ఫామ్ పై డైరెక్ట్ రిలీజ్ కాబోతున్న పేరున్న కమర్షియల్ హీరో చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ చూస్తే ఒక వ్యక్తిని కుర్చీలో కట్టేసి దారుణంగా చంపిన సంఘటన, సుధీర్ బాబు పాత్ర ద్వారా సైకో గురించి ప్రస్తావన, ట్రైలర్ లో నడుస్తున్న సంభాషణలను బట్టి నాని పాత్రను వైవిధ్యంగా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది.
మునుపెన్నడూ చూడని మాస్ లుక్ నాని అభిమానులకు పరిచయం చేయబోతున్నట్లు కనబడుతుంది. ఓవరాల్గా సినిమా క్రైమ్ & పనిష్మెంట్ నేపథ్యం ఎంచుకున్నట్లు ఊహ కలుగుతుంది.
సినిమాకు సంగీతం అమిత్ త్రివేది అందిస్తే నేపధ్య సంగీతం తమన్ చేయడం చూస్తుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఈ చిత్రంలో ప్రాముఖ్యత ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్లో నివేద థామస్ మాత్రమే కనిపించడం, అతిథి రావు హైదరి ఎక్కడా కనిపించక పోవడం చూస్తుంటే సినిమా కథ పూర్తిగా ఆమె చుట్టే నడుస్తోందా అనే అనుమానం కలగక మానదు.
ఓవరాల్ గా దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్, PG.విందా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎంతవరకు అలరిస్తుందో ప్రేక్షకులే నిర్ణయిస్తారు.
Discussion about this post