2018 Movie OTT Release Date : మలయాళంలో రీసెంట్ గా రిలీజై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమా “2018”. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ మూవీ. ఇక కేరళలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.
కేరళ లో 2018 వ సంవత్సరంలో వచ్చిన అతి భయంకరమైన వరదలు వచ్చినప్పుడు, ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవించారు? ఎలాంటి ఇబ్బందులను ఎదురుకున్నారు అనే దానిని ప్రధాన అంశంగా తీసుకొని ఫిక్షనల్ గా ఒక నాలుగు పాత్రలను తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘2018’. ఈ సినిమా కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.
ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 150 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ సినిమా, మే 26న తెలుగు లో గ్రాండ్ గా విడుదలైంది. ఇక్కడ కూడా ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఓటీటీలో అలరించనుంది. SonyLiv లో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.