Actor Naveen Chandra : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో..
విభిన్నమైన ప్రేమ కథ “అందాల రాక్షసి”తో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర..
అయితే ఆ తరువాత తీసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా.. ‘అరవింద సమేత’ లో కీలక పాత్ర లో నటించి ప్రేక్షకులని మెప్పించిన ఆయన.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే నెగిటివ్ రోల్స్ కూడా పోషించారు. ‘ ముఖ్యంగా ‘అరవింద సమేత’లో జగపతిబాబు కొడుకుగా బాలిరెడ్డి పాత్రలో మెప్పించారు. ఇక లాక్‌డౌన్‌లో ఓటీటీకి ఆదరణ బాగా పెరగడంతో ఆహా, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి పాపులర్ ప్లాట్‌ఫాంస్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు.

పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ OTT ప్లాట్ ఫామ్ పై కూడా ప్రేక్షకులని అలరిస్తూ మంచి పేరే సంపాదించున్నాడు. తాజాగా అభిమానులతో ఒక శుభవార్త పంచుకున్నాడు ఈ యంగ్ హీరో .. తాను “తండ్రి” కాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. తన భార్య బేబీ బంప్ ఫోటోలను షేర్ చేశారు.. “తండ్రి కాబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.. నిన్ను నా చేతుల్లోకి ఎప్పుడు తీసుకుని ముద్దాడుతానా అని ఎదురుచూసేందుకు ఆగలేకపోతున్న.. కొత్త దశ, కొత్త జీవితం,కొత్త ప్రయాణం..ఒర్మా ఐ లవ్ యూ” అని పోస్ట్ చేశాడు.. దీనితో నవీన్ చంద్రకి అభిమానులు.. ప్రేక్షకులు అంతా కంగ్రాట్స్ చెప్తున్నారు.
View this post on Instagram
How can I embed youtube generator BT Sport with EE? | Help | EE
