వెండితెరపై అయాన్ లైట్ ల మధ్య వెలుగులీనే సినీ తారలు మేకప్ ముసుగు లతో కనిపించే తమ జీవితాల్లో ఎన్నో అవరోధాలు, అవహేళనలు, అవమానాలు ఎదుర్కొంటారు. సినీ పరిశ్రమలో కొనసాగే నటి మణులపై సమాజంలో ఉన్న చిన్న చూపు పై వారిలో ఎంతో ఆవేదన దాగి ఉంటుంది. అలాంటి వారిపై నా మనసులో మాట ఇది అంటూ గళమెత్తారు నటి మాధవి. తాజాగా జీవితంలో తాను ఎదుర్కొనే పరిస్థితులను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా తన భావాలను ఇలా పంచుకున్నారు.
నేను బాగుండాలి నాతో పాటు ఈ సమాజం బాగుండాలి అని కోరుకోవడం నా నేరం నాకు ఒక రోజు వస్తది ఈ సంఘం డబ్బు, పదవి ఈ రెండింటికి మాత్రమే భయపడుతుంది, దాసోహం అంటుంది.
ఈ రోజు అవి నాకు లేకపోవొచ్చు ఒక రోజు త్వరలోనే వస్తుంది ఆ రోజు చెప్తాను
అందరిని లెక్కపెడుతున్న , అన్ని గుర్తుపెట్టుకుంటా నన్ను తిట్టిన నోర్లు నన్ను శపించిన నోర్లు నన్ను తక్కువగా చుసిన కళ్ళు,నన్ను తొక్కేయాలనుకున్న మనుషులు,నన్ను హింసించిన మనసులు,నన్ను నిందించిన గొప్పవాళ్ళు,నన్ను బెదిరించిన వాళ్ళు అందరిని గుర్తుపెట్టుకున్నా.
నేనేమి చేయను
కానీ అందరి నోర్లు మూసుకుంటాయి
మొరిగే కుక్కలు ఎపుడు వీధుల్లోనే ఉండిపోతాయి
నేను మాత్రం ఆకాశమంత
ఆడది ఎపుడు ఆకాశం లో సగం ఆమె కష్టాలతో పుడుతుంది
కష్టాలతో పోరాడుతుంది
కష్టాల్లో బతుకుతుంది.
ఓర్వలేని వాళ్ళు
ఓర్చుకోలేని నోర్లు
వాగుతూనే ఉంటాయి.
కానీ నేను సాగుతునే ఉంటాను.
నేను నమ్మిన నిజం,
మా అమ్మ నేర్పిన గుణం,
నేను నమ్ముకున్న నిజాయితీ,
మా నాన్న ఇచ్చిన రక్తం
నాలో ఉండగా ఆ దేవుడు నన్ను శిక్షించాలి తప్ప
ఈ భూమి మీద శక్తులు
మొరిగే కుక్కలు నన్ను ఏమి చేయలేవు.
నేనే నా సైన్యం, నేనే నా బలం
నేను ఒక మహిళను,
పోరాటమే నా ఆయుధం.
నాకు భయాలు ఉంటాయి,
బంధాలు ఉన్నాయి.
కానీ నేను మీలాగా చేతకాని దాని కాదు.ముఖాలు దాచుకుని రాతలు రాయను.
నేను ఒక ధైర్యాన్ని
నేను ఒక పయనాన్ని
నేను ఒక గమ్యాన్ని
ఎవరో వస్తారని ఎదో చేస్తారని నేను ప్రయాణం మొదలు పెట్టలేదు
కనుక ఎవరో ఆపేస్తారని నాకు భయం లేదు.
ఆడపిల్ల బయటకి వస్తే నిందలు
నటి అయితే ఆమె పతిత అయినట్లే, ఇక్కడంతా రాముల్లె అన్నట్లు అందరి భావన.
ఎవడు ఉత్తముడు లేదు
తల్లిని ప్రేమగా చూస్తూ పక్కింటి తల్లిని కామం తో చూసే కొడుకులు కుక్కలున్న సమాజం.
మీకు ఒక మహిళని అనే అర్హత లేదు ఆమె బయటకి వస్తే బరితెగించింది అంటారు.
ఆమె పని చేస్తే పతిత అంటారు
ఆమె గొంతు విప్పితే పది మందితో పడుకుంది అంటారు
అసలు నువ్వెవడురా?
ఒక మహిళా స్థానాన్ని నిర్ణయించడానికి
నీలాటివాడే తల్లి స్థనాన్ని తాకి ఆమె స్థానం ని ప్రశ్నించేది
ఎవడివిరా నువ్వు
నీ బతుకేంటి?
నీ నోరు నీ మెదడు చెడిపోయింది కనుకే
నువ్వు ఇలా అందరు చెడిపోయారు అనుకుంటావు
చెడింది ఆమె కాదు రా నువ్వు నీ ఆలోచన నిన్ను కన్నది నాలాంటి ఒక ఆడదే
చెడ్డ భార్య చెడ్డ ప్రియురాలు ఉంటాదేమొ కానీ చెడ్డ తల్లి ఉండదు గుర్తు పెట్టుకో.
ప్రతి అమ్మాయి ఒకరికి ప్రియురాలే,ఒకరికి భార్యే
ఆమె తల్లి గ మారుతుంది రా నీతిలేని కుక్కా
నన్ను తిట్టే బూతులు
తప్పుగా మాట్లాడే ప్రతి వీధి కుక్కలాంటి మనుషులకి
చెప్తున్నా నీ కంటే అడవిలో మృగాలే మంచివి.
నువ్వూ డాష్ అని నన్ను అనే ప్రతి డాష్ గాడికి చెప్తున్నా
మగాడు లేకుండా ఆడపిల్ల ఎలా చెడిపోతుంది రా కుక్క
మగాడు అంత మంచోడేలా అవుతాడు
ఆడది చెడింది ఎందుకు అవుతుందిరా?
అసలు పరాయి అమ్మాయి ఎలాంటిదో నువ్వు ఎవడురా సర్టిఫికెట్ ఇవ్వడానికి
నువ్ ఎవడురా నిర్ణయించడానికి?
మగాళ్లంతా ఉత్తములు
అమ్మాయిలు పతితలా?
అయితే నీ తల్లి అక్క చెల్లి భార్య కూడా పతితలే కదరా ?
అమ్మాయిలని కడుపులో చంపేస్తున్నారు
అమ్మాయిలని పుట్టగానే పడేస్తున్నారు
కాస్త ఎదిగాక సమాజం అరాచకాలు
అంత కస్టపడి ఎదో సాధించాలి
తనకి నచ్చిన ఫీల్డ్ లో ఎదగాలి అంటే
సూటి పోటీ మాటలు ఎందుకు?
మా నాన్న
నా అన్నలు కూడా మగాళ్లే
ఎపుడు ఒక ఆడపిల్లని తప్పుగా చుసిన కళ్ళు కాదు
మాటలన్న నోర్లు కాదు
అందుకే నాలాంటి కూతుర్లకు స్వేచ్ఛనిచ్చిన
తండ్రులకి అన్నలకి
తమ్ముళ్ళకి ఆమె విలువ తెలుసు ఆమె శక్తి తెలుసు, ఆమె తెగువ తెలుసు, ఆమె ఆదిశక్తి అని తెలుసు.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
ఐన సరే తిట్టేవాళ్ళు తిట్టని, ఏడ్చేవాళ్ళు ఏడవని,
నేను నమ్మిన మార్గం మంచిదైనపుడు
నేనెందుకు ఆగిపోవాలి?
నేను ఆగిపోతే ఈ గురివింద సమాజం గు …… నలుపు మూసుకొని నన్ను అంటుంటే నేను బయపడి పారిపోయినట్లు.
మీ చేతకానీ తనానికి నేనెందుకు బలి కావాలి?
సింహంతో ఆట
మాధవి తో మాట
జాగర్తగా వాడాలి నడు
నేను నమ్మింది మనిషిని కాదు,
నిజాన్ని నిజాయితీని
నిజమే గెలుస్తుంది అన్నది నిజమే కానీ
గెలిచేదంతా నిజం కాదు అంటూ ఆమె తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వారిపై విరుచుకు పడ్డారు.
నర్మగర్భంగా ఆమె చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఎవరినో హెచ్చరించినట్లు అనిపిస్తుంది.