Agent OTT Release Date : అఖిల్ ‘ఏజెంట్’.. థియేటర్లలోకి వచ్చి ఐదు రోజులు కూడా పూర్తవలేదు. అప్పుడే ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఏజెంట్ కోసం చాలా కష్టపడ్డాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. డినో మోరియా విలన్ రోల్ చేశారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దీంతో అతి త్వరలో ఈ సినిమా ఓటీటీలో సందడికి సిద్ధం అయ్యింది. థియేట్రికల్ బాక్సాఫీస్ వద్ద జరిగాన నష్టాన్ని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తోంది మూవీ టీం. సందర్భంగానే ఏజెంట్ మూవీ ఆన్లైన్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ Liv రీజనబుల్ ప్రైజ్ కి సొంతం చేసుకుంది.
కాగా, తాజాగా ఈ మూవీ ఓటీటీ స్రీమింగ్ డేట్ పై అప్డేట్ ఇచ్చింది ఓటీటీ సంస్థ సోని లివ్. ఈ సినిమా ఈ నెల 19న ఓటీటీలో రిలీజ్ కానున్నట్టు వెల్లడించింది. తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ వంటి పలు భాషల్లో ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏజెంట్ నెల తిరక్కుండానే ఓటీటీలోకి వస్తుండడంతో ఓవైపు మూవీ లవర్స్ ఎగ్జైట్ అవుతున్నప్పటికీ.. థియేటర్ కి వెళ్లి చూసినవాళ్లు మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఇలా అయితే థియేటర్ లో చూసే వాళ్ళం కాదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
https://twitter.com/Keshav4005/status/1653463387966193665?t=pU69_qM20z4A0VYgyH18bQ&s=19
Discussion about this post