Allari Naresh Ugram : నిన్న మొన్నటి వరకు నవ్వుతూ.. నవ్విస్తూ ఉన్న అల్లరి నరేష్ .. ఉన్నట్టుండి తన జానర్ మార్చాడు. సీరియస్ రోల్స్ చేస్తూ… స్ట్రెయిట్ అవే హిట్లు కొడుతున్నాడు. మొన్న నాంది, నిన్న మారేడుమిల్లి ప్రజానీకంతో మెప్పించిన నరేష్ తాజాగా ఉగ్రం మూవీతో రాబోతున్నాడు. ఆల్రెడీ ట్రైలర్ లో ఉగ్రరూపాన్ని చూపించేశాడు. ట్రైలర్లో అల్లరి నరేష్ కొత్తగా, మునుపెన్నడూ చూడని ఫెరోషియస్ పాత్రలో కనిపించారు. ముఖ్యంగా, ట్రైలర్ రెండవ సగం అతన్ని బ్రూటల్ అవతార్‌లో ప్రజంట్ చేసింది.
రిలీజ్ కి ముందే ఈ మూవీపై పాజిటివ్ బుజ్ ఏర్పడింది. నాంది తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. మనుషుల మిస్సింగ్ నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఉన్నాయని అల్లరి నరేశ్ ప్రతి ఇంటర్వ్యూలోను చెబుతూ వస్తున్నాడు. ఈ సినిమాలోని ఫైట్స్ ను డిఫరెంట్ గా డిజైన్ చేయడం జరిగిందని అన్నాడు.
ప్రతి ఫైట్ ఎమోషన్స్ తో లింకై ఉంటుందని చెప్పాడు. కథాకథనాలతో పాటు ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకొచ్చాడు. మరి ఆ ఫైట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయనేది రేపు థియేటర్స్ లో చూడవలసిందే. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. రేపు విడుదల కానున్న ఈ చిత్రంలో నరేష్ ‘ఉగ్ర’రూపం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.
Discussion about this post