సినిమాలతో పాటు బిజినెస్‌లపై కూడా దృష్టిపెట్టారు మన టాలీవుడ్ స్టార్స్. కొంతమంది హీరోలు అటు సినిమాలు చేస్తూనే వ్యాపారరంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు ఏషియన్ గ్రూప్‌తో కలిసి AMB మాల్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. అలాగే భార్య నమ్రత పేరు మీద హోటల్ బిజినెస్ ప్రారంభించారు. మరోవైపు రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ వాళ్లతో కలిసి మహబూబ్ నగర్‌లో AVD సినిమాస్ స్థాపించిన సంగతి తెలిసిందే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే.. మల్టీప్లెక్స్, నిర్మాణ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి A A A సినిమాస్ (ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్) స్థాపిస్తున్నాడు. అమీర్ పేట్ సత్యం థియేటర్‌ని పడగొట్టి.. అదే ప్లేసులో చాలా రోజుల క్రితమే శంకుస్థాపన చేశారు.
అత్యాధునిక హంగులు, విలాసవంతమైన సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఏషియన్ సత్యం మాల్ & మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తయింది. జనవరిలో ప్రారంభించనున్నారని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌కి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ‘పుష్ప’ రష్యా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం అక్కడికెళ్లిన టీం ఎలాంటి సందడి చేశారో తెలిసిందే. పాండమిక్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో పుష్ప క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దీంతో పుష్ప 2పై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి.