Allu Arjun And Trivikram : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. పుష్ప ముందు వరకు అల్లు అర్జున్ క్రేజ్ సౌత్ వరకే ఉండేది కానీ పుష్ప నార్త్ లో సంచలనాలు సృష్టించడంతో ఇప్పుడు నార్త్ లో కూడా బన్నీకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. అందుకే పుష్ప 2 గ్లిమ్స్ ఇలా వచ్చిందో లేదో అల వైరల్ అయ్యింది. పుష్ప 2 లో నార్త్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు కూడా ఉండేట్టు ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ సుకుమార్.
అయితే పుష్ప 2 తర్వాత బన్నీ ఏ డైరెక్టర్ తో చేస్తాడు అనేదానిపై ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేస్తాడని టాక్. అయితే ఏజెంట్ ఫ్లాప్ తర్వాత కూడా అల్లు అర్జున్ అతనికి ఛాన్స్ ఇస్తాడా అన్నది డౌట్ కొడుతుంది. అయితే గతంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాల్లో నటించారు బన్నీ.
ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తో కలిసి బన్నీ మరోసారి వర్క్ చేయనున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్ బన్నీ సరసన నటించనుందట. ప్రస్తుతం నెట్టింట ఈ న్యూస్ వైరల్ గా మారగా త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. మళ్లీ ఈ కాంబో రిపీట్ అయితే మాత్రం అటు బన్నీ ఫ్యాన్స్ కి, గురూజీ ఫ్యాన్స్ కి పండగే.