Allu Arjun – Atlee : జవాన్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1000 కోట్ల క్లబ్ లో చేరడానికి రెడీగా ఉంది. ఈ సినిమా తీసిన డైరెక్టర్ అట్లీ అందరి దృష్టిని ఆకర్షించి తనతో డైరెక్షన్ లో హీరోగా చేయాలని ఆలోచన అందరిలో కలిగించాడు. అట్లీ డైరెక్షన్ తీరు,కథ తీసుకెళ్లే విధానం, యాక్షన్ ఎపిసోడ్స్, కరణ్ జోహార్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ పోతినేని ఫిదా అయిపోయి అట్లీ మీద ప్రశంసల జల్లు కురిపించారు.
ఇంత విజయంతో దూసుకెళ్తున్న అట్లి తర్వాత సినిమా ఎవరితో తీస్తాడు. అనే చర్చ కచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు అదే టాపిక్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అట్లీ దర్శకత్వంలో ఏ హీరో నెక్స్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే పుష్ప మూవీతో పాన్ ఇండియాలో తన దంటూ ముద్ర వేసిన అల్లు అర్జున్ తో అట్లీ తన తదుపరి చిత్రాన్ని తీయబోతున్నాడని ఒక వార్త ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అయింది.
వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ మూవీ ఉంటుందని వార్త తెగ హల్చల్ చేస్తుంది. అంతే కాకుండా ఈ మూవీకి అల్లు అర్జున్ ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అదే కనుక నిజమైతే ప్రేక్షకుల సంబరాలకి అవధులు ఉండవు. అట్లీ లాంటి డైరెక్టర్, అల్లు అర్జున్ లాంటి హీరోని డైరెక్ట్ చేస్తే ఇంకా ఆ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ సినిమా తొందరగా పట్టాలెక్కి అతి తొందరగా ప్రేక్షకుల ముందు వస్తే బాగుంటుంది.. చూద్దాం ఏం జరుగుతుందో..