Allu Arjun At Vizag Airport: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రూల్” లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి నటుడు అల్లు అర్జున్ గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకున్నారు. రాత్రి పది గంటలకు ఇండిగో విమానంలో నగరానికి చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్.. వారికి అలా అభివాదం చేస్తూనే తన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం ఎక్కి నొవాటెల్ హోటల్ కి వెళ్లిపోయారు. శుక్రవారం నుండే 10 రోజుల పాటు విశాఖ పరిసర ప్రాంతాల్లో పుష్ప 2 మూవీ షూటింగ్ జరగనుంది.
విశాఖ, అరకు లోయ, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరగనున్న షూటింగ్‌లో అల్లు అర్జున్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. పుష్ప 2 షూటింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన డైరెక్టర్ సుకుమార్.. పుష్ప రాజ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ తో పాటు జగపతిబాబు కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతారు.